ఎక్కడైనా పెళ్లి జరుగుతుంటే వెళ్లి తిని వచ్చేవాడిని :: విజయ్ రంగరాజు
'నాకు పోలీస్ కావాలన్నది ఆయన చిరకాల ఆశ అంట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రయత్నించాను. అప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను. ఆ టైములో నేను పది రోజులపాటు కుండలో నీళ్లు తాగి కడుపునింపుకునేవాడిని. తినడానికి కూడా తిండి ఉండేది కాదు. మంచినీళ్లతో సరిపెట్టుకునేవాడిని. ఎక్కడైనా పెళ్లి జరుగుతుందంటే వెళ్లి తిని వచ్చేవాడిని. నా మొదటి సినిమా బాపుగారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం.
ఆ సినిమాలో నేను వేషం కోసం ట్రై చేశాను. 15 రోజులు పని, రోజుకు రూ.150 ఇస్తామన్నారు. సరే అని అడ్వాన్స్ అడిగాను. వాళ్లు షాకైపోయి ఇంతవరకు వేషం వేయలేదు, ఇండస్ట్రీకి కొత్త అంటున్నావు.. నువ్వేంటి అడ్వాన్స్ అడుగుతున్నావని నిలదీశారు. మరి బతకాలి కదా సర్.. అడ్వాన్స్ ఇస్తేనే చేస్తాను, లేదంటే చేయనని చెప్పాను. ఆ తరువాత నా ధైర్యాన్ని మెచ్చి రూ.100 అడ్వాన్స్ ఇచ్చి పంపించారు' అని చెప్పుకొచ్చాడు విజయ్ రంగరాజు.
ఆయన మన తెలుగు లో కూడా చాలా సినిమాల్లో చేసారు. ముఖ్యంగా ఆయన గోపీచంద్ హీరోగా చేసిన యజ్ఞం సినిమాలో నాయుడమ్మా క్యారెక్టర్ తో అందరిని మెప్పించారు.