ఆ హీరో పై షాకింగ్ కామెంట్స్ చేసిన హన్సిక....!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కు లైంగిక వేధింపులు కొత్తేమి కాదు. చాలా ఏళ్ల నుంచి ఇది కొనసాగుతున్న తంతే. అయితే ఆ మధ్య శ్రీరెడ్డి లైంగిక వేధింపులపై పోరాటం చూసిన తరువాత చాలామంది హీరోయిన్స్ బయటకు వచ్చి, ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే చెప్పడం జరిగింది.
టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పలేదు. తాజాగా హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ఓ ఇంటర్య్వూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేసింది.ఆ వివారల్లోకి వెళ్తే..
దేశముదురుతో ఎంట్రీ: బాలనటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన హన్సిక .. కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కాని అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2007, జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
బాక్సాఫీస్ వద్ద 'దేశముదురు' సూపర్ హిట్‌గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. 'దేశముదురు' సినిమా తరువాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి.
తమిళంలో నెంబర్ 1 హీరోయిన్‌గా: తెలుగులో అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి ఆగ్ర హీరోలతో మాత్రమే ఆఫర్లు దక్కాయి. అల్లు అర్జున్‌తో 'దేశముదురు' తరువాత ,ఎన్టీఆర్‌తో 'కంత్రి'లో మాత్రమే కనిపించింది. తెలుగులో కంటే కూడా ఎక్కువుగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది.
తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశం హన్సికకు దక్కింది. తమిళంలో ఆమెకు ప్రత్యేకమైన అభిమాణగణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
శింబుతో ఎఫైర్: హన్సిక హీరోయిన్‌గా ఎంతటి పేరు తెచ్చుకుందో.. వివాదాల ద్వారా కూడా అదే విధంగా వార్తల్లో నిలిచింది. నయనతారతో శింబు బ్రేకప్ అయిన తరువాత.. హన్సికతో కొన్నాళ్లు ప్రేమయాణం సాగించాడు. తామిద్దరం ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని ఈ జంట ప్రకటించారు.
కాని శింబు ప్రవర్తన నచ్చక .. కొన్నాళ్లకే అతనికి బ్రేకప్ చెప్పేసింది ఈ చబ్బీ బ్యూటీ. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో..గతేడాదే పెళ్లి పీటలెక్కిసింది. సొహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హ‌న్సిక‌కు ఇది మొద‌టి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం ఇది రెండోది.
ఘెరంగా అవమానించారు: ఇక ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే తాను అవమానాలను ఫేస్ చేశానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో హన్సిక చెప్పుకొచ్చింది. డిజైనర్స్ నాతో రూడ్‌గా బిహేవ్ చేసేవారని.. ఈ మోడల్‌లో బట్టలు నాకు చేయిస్తారా అని అడిగితే ..వాళ్ళు కుదరదు అని మొహం మీదనే చెప్పేసేవాళ్లని తెలిపింది. కాని నాకు డిజైనర్ బట్టలు ఇవ్వను అన్నవాళ్ళే ఇప్పుడు నాకోసం డిజైనర్లుగా పనిచేయడానికి ఎగబడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

ఆ హీరో వస్తావా అంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడు: ఈ సమయంలోనే ఇండస్ట్రీలో తనకు ఎదురైనా వేధింపుల గురించి కూడా వెల్లడించింది. తెలుగులో ఓ హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశాడని..డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరోకి తగిన రీతిలో తగిన బుద్ది చెప్పానని ఈ అమ్మడు తెలిపింది. ఆ హీరో పేరు మాత్రం వెల్లడించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ హీరో ఎవరా అని తెగా ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: