ఆ స్టార్ హీరోను చెప్పుతో కొడతానన్న అవికా గోర్..!!

murali krishna
అవికా గోర్ మొదట  బాలిక వధు అనే సీరియల్ ద్వారా అవికా గోర్ ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ సీరియల్ తెలుగులో కూడా చిన్నారి పెళ్లికూతురు అనే పేరుతో కూడా వచ్చింది. ఇక ఇప్పటికి కూడా ఈ సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి సీరియల్ ద్వారా ఇంత ఫేమస్ అయిన చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ ఉయ్యాల జంపాల అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైందటా..ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా చేసాడు..ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ అవికా గోర్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి సినిమా కూడా పెద్ద హిట్ అయింది.
ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో నటించిందటా.ఇక ఈమె తెలుగులో నటించిన సినిమాలు సినిమా చూపిస్త మావా,లక్ష్మీ రావే మా ఇంటికీ, రాజు గారి గది 3, C/O ఫుట్పాత్, థాంక్యూ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, 10th క్లాస్ డైరీస్, నెట్, పాపకార్న్,ఉమాపతి మరియు తను నేను వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నింటిలో ఎక్కడికి పోతావు చిన్నవాడా,రాజు గారి గది 3, సినిమా చూపిస్త మామ అలాగే ఉయ్యాల జంపాల  వంటి సినిమాలు ఈ హీరోయిన్ కి మంచి గుర్తింపు ను తీసుకొచ్చి పెట్టాయి. అయితే మొదటి సినిమా ఉయ్యాల జంపాల సూపర్ హిట్ అవడంతో ఈ హీరోయిన్ కొద్దిరోజుల్లోనే ఇండస్ట్రీని ఏలే స్థాయికి వస్తుందని సెలబ్రిటీలు కూడా అనుకున్నారట.
ఇక ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ ఈమెను బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోస్ అనే ఒక గ్రూపులో ఆడ్ చేసిందని తెలుస్తుంది.అంతేకాకుండా అవిక గోర్ తో చాలామంది బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ హీరోయిన్స్ కూడా సన్నిహితంగా ఉండేవారని తెలుస్తుంది.. అయితే ఆ గ్రూపులో యాడ్ చేశాక ఒక టాలీవుడ్ హీరో అవిక గోర్ కి పర్సనల్ గా మెసేజ్ చేసి మాట్లాడుతూ నీ న్యూడ్ వీడియో ఒకటి పంపిస్తావా అని అడిగారట. ఇక ఈ మెసేజ్ తో షాక్ అయినా అవికా గోర్ వీడికి ఎలాగైనా గట్టి బుద్ధి చెప్పాలి అని అనుకొని తన మాటలతో రెచ్చిపోయిందని సమాచారం.అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అని కూడా పట్టించుకోకుండా నా ముందుకు వస్తే నిన్ను చెప్పుతో కొడతా అని వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇక అలా మాట్లాడడంతో అవికా గోర్ ని ఆ టాలీవుడ్ హీరో మనసులో పెట్టుకొని ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాకుండా చేశారట. అంతేకాదు ఆమెకు వచ్చిన అవకాశాలను కూడా దర్శకనిర్మాతల దగ్గరికి వెళ్లి ఆ హీరోయిన్ కి అంతగా యాక్టింగ్ రాదు ఆమె చేస్తే మూవీ ప్లాప్ అవుతుంది అని ఏదో ఒకటి చెప్పి ఆమెకి వచ్చిన అవకాశాన్ని కూడా చెడగొట్టాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: