స్టేజ్ పైనే హీట్ పెంచేస్తున్న రొమాంటిక్ పెయిర్....!!

murali krishna
నరేష్‌-పవిత్రా లోకేష్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌ కపుల్‌. వీరద్దరూ ఏం చేసినా సంచలనమే. ఇక తాజాగా ఇద్దరు రొమాంటిక్‌ డ్యాన్స్‌తో ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ఆ వివరాలు..
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ ట్రెండింగ్‌ కపుల్‌గా నిలిచారు సీనియర్‌ నటీనటులు నరేష్‌-పవిత్రా లోకేష్‌. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నరేష్‌ తన మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక నరేష్‌-పవిత్రా లోకేష్‌, రమ్య రఘుపతిల మధ్య జరిగిన వార్‌, ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు ఇవన్ని టాలీవుడ్‌లో సంచలనంగా మారాయి. నరేష్‌ మరో అడుగు ముందుకు వేసి.. తన జీవితంలో ఈమధ్య కాలంలో చోటు చేసుకున్న సంఘటనలతో మళ్లీ పెళ్లి సినిమా తీశాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమా మీద భారీ అంచనాలే పెంచాయి. ఇక నరేష్‌-పవిత్రా లోకేష్‌ జంటగా సినిమా ప్రమోషన్స్‌ పాల్గొంటూ సినిమా మీద హైప్‌ పెంచుతున్నారు. ఇక తాజాగా ఈ జంట స్టేజీ మీద డ్యాన్స్‌తో రచ్చ చేశారు. ఆ వివరాలు..
మళ్లీ పెళ్లి సినిమా విడుదల నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్‌, పవిత్ర ఇద్దరు మళ్లీ పెళ్లి చిత్రంలోని రారా హుజురు పాటకు స్టేజీ మీద డ్యాన్స్‌తో రెచ్చిపోయారు. రొమాంటిక్‌ సాంగ్‌కు అనుకూలంగా వీరు.. స్టేజీ మీద రొమాంటిక్‌ స్టెప్స్‌ వేసి.. ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నరేష్‌ మూడో భార్య రమ్య రఘుపతి ఈ సినిమా గురించి ఎక్కడా ఒక్క మాట మాట్లాడలేదు.
ట్రైలర్‌లో నరేష్‌ను ఉద్దేశించి ‘వెయ్యి కోట్ల ఫిగర్ సార్ మీరు’ అనే డైలాగ్ ఉంది. ఈ క్రమంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో నరేష్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనికి ఆయన నవ్వుతూనే తానొక బిలియనీర్‌ని అని ఒప్పుకున్నారు. తన తల్లి విజయనిర్మల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన సంపద కొంత అయితే.. తాను కష్టపడి సంపాదించిన ఆస్తి ఇంకొంత ఉందని నరేష్ తెలిపారు. అంతేకాక తన దగ్గర ఉన్నదంతా వైట్ మనీ అని.. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవ్వరైనా చెక్ చేసుకోవచ్చన్నారు నరేష్‌. చాలా గౌరవప్రదంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నానని చెప్పుకొచ్చార. ప్రస్తుతం నరేష్‌-పవిత్రా లోకేష్‌ డ్యాన్స్‌ వీడియో నెట్టింట వైరలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: