ఆ కారణంగా భార్య ప్రేమకు ఫిదా ఐనా జూనియర్ ఎన్టీఆర్...!!

murali krishna
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్వీట్, క్యూట్ కపుల్ కాగా తాజా గా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.
ఎన్టీఆర్ సినిమాల కు సంబంధించిన వరుస అప్ డేట్స్ ఎన్టీఆర్ అభిమానులను సంతోషానికి గురి చేశాయి. దేవర, ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ, వార్2 సినిమాలకు సంబంధించి న అప్ డేట్స్ వచ్చాయి. అయితే తారక్ పుట్టినరోజున లక్ష్మీ ప్రణతి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది.
ఆమె ఇచ్చిన గిఫ్ట్ ను చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం షాకయ్యారని సమాచారం. లక్ష్మీ ప్రణతి తారక్ కు ప్లాటినం బ్రేస్లేట్ ను  బహుమతి గా ఇచ్చారని ఈ బహుమతి ఖరీదు లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ బ్రేస్లేట్ ను చూసిన ఎన్టీఆర్ భార్య తన పై చూపించిvన ప్రేమకు ఫిదా అయ్యారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ ప్రణతి కలకాలం అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువే అయినా ఈ జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఎన్టీఆర్, ప్రణతి పిల్లల పేర్లు భార్గవ్ రామ్, అభయ్ రామ్ కాగా అభయ్ రామ్ చాలా సైలెంట్ అని భార్గవ్ రామ్ అల్లరి అని టాక్ ఉంది. పిల్లల పెంపకం విషయంలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ కెరీర్ పరం గా బిజీ గా ఉండ గా తారక్ పారితోషికం సైతం అంతకంతకూ పెరుగుతోంది. రీ రిలీజ్ లో సింహాద్రి మూవీ భారీ స్థాయి లో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకోవడం తో పాటు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. లక్ష్మీ ప్రణతి వ్యాపార వ్యవహారాలకు దూరం గా ఉంటున్నారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: