పుష్ప2 లో బాలీవుడ్ స్టార్ హీరో?

Purushottham Vinay
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలు సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్ వంటి మూవీస్ ఎఫెక్ట్‏తో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ చూపు సౌత్ పై పడింది.ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో పలు సినిమాలు చేస్తూ సౌత్ ఆడియన్స్ కు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోస్ కూడా తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ సినిమాలో నటించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రాబోతున్న దేవర చిత్రంలో కూడా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు మరో హీరో తెలుగు మూవీలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.అతనే బాలీవుడ్ ఎనర్జీటిక్ హీరో రణ్వీర్ సింగ్.రణ్వీర్ సింగ్ కూడా షారుఖ్, హృతిక్ లాగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో.


కేవలం నార్త్ లోనే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో.. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో నటించనున్నారట. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో పుష్ప 2 సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా గురించి ఇప్పటికే ఆసక్తికర విషయాలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ కీలకపాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.ఈ మూవీలో రణ్వీర్ సింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని.. గొప్ప థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా అతని రోల్ ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఇంకా అంతేకాకుండా.. అతని పాత్ర ఎవ్వరూ ఊహించని విధంగా కూడా ఉంటుందని సమాచారం తెలుస్తోంది. సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2 సినిమాలో పరిచయం కానున్నాయి. దీంతో ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: