బాలకృష్ణ సినిమాకు తమన్నా కండిషన్స్ ?

Seetha Sailaja
‘ఎఫ్ 3’ ఊహించిన స్థాయిలో విజయం అందుకోలేక పోవడంతో అనీల్ రావిపూడి బాలకృష్ణ తో తీస్తున్న మూవీని ఎట్టి పరిస్థితులలోను బ్లాక్ బష్టర్ హిట్ చేసి తీరాలి అన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నాడు. దసరా ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈ మూవీలో బాలకృష్ణ తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా తెలంగాణ నేపద్యం ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.

బాలకృష్ణ పక్కన కాజల్ హీరోయిన్ గా నటిస్తూ ఉంటే శ్రీలీల బాలయ్య కూతురుగా ఈ మూవీలో నటిస్తోంది. అనీల్ రావిపూడి ఈమధ్య తీస్తున్న ప్రతి సినిమాలోను తమన్నాను హీరోయిన్ గా పెట్టుకుంటున్నాడు. అలా కుదరకపోతే ఆమె చేత ఐటమ్ సాంగ్ అయినా చేయిస్తున్నాడు. మహేష్ తో తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో తమన్నా ఐటమ్ సాంగ్ బాగా క్లిక్ అవ్వడంతో మళ్ళీ అలాంటి ప్రయోగాన్ని బాలకృష్ణ తో తీస్తున్న మూవీలో చేయాలని అనీల్ రావిపూడి పక్కా స్కెచ్ వేసినట్లు సమాచారం.

అయితే బాలయ్య పక్కన ఐటమ్ సాంగ్ లో నటించకపోవడానికి తమన్నా అడిగిన పారితోషికం అనీల్ రావిపూడికి షాక్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తమన్నా క్రేజ్ పూర్తిగా తగ్గిపోయిన తరువాత ఆమెకు ‘ఎఫ్ 2’ లో అదేవిధంగా ‘ఎఫ్ 3’ లో అవకాశం ఇవ్వడమే కాకుండా ఆమెకు ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఐటమ్ సాంగ్ కు అవకాశం ఇచ్చిన వ్యక్తి అనీల్ రావిపూడి అలాంటి వ్యక్తి అడగగానే తమన్నా కృతజ్ఞతతో బాలయ్య పక్కన ఐటమ్ సాంగ్ లో నటించకుండా ఇలా చుక్కలు చూపించే విధంగా పారితోషికం అడగడం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు గుసగుసలాడు కుంటున్నారు.

అయితే బాలకృష్ణ తమన్నా తో ఐటమ్ సాంగ్ చేయిస్తే అన్నివిధాల ఆ సినిమాకు ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశ్యంతో అనీల్ రావిపూడి తమన్నాను ఈమూవీ ప్రాజెక్ట్ లోకి ఐటమ్ సాంగ్ విషయంలో తమన్నాను ఏదోవిధంగా ఒప్పించాలని తన వంతు ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: