రూ.1.5 లక్షలకే పెళ్లి చేసుకున్న టాలివుడ్ హీరోయిన్..!!

Divya
మహేష్ బాబు నటించిన చిత్రాలలో అతిధి సినిమా కూడా ఒకటి.ఈ చిత్రం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ ఇందులో హీరోయిన్గా నటించిన అమృత రావు ప్రతి ఒక్కరికి గుర్తు ఉండనే ఉంటుంది.. బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలలో నటించి సక్సెస్ అయ్యింది. అమృత రావు 2016 వ సంవత్సరం నుండి ఆర్జె ఆర్మూర్ అనే ఒక కుర్రాడిని ప్రేమిస్తోంది.. ఇద్దరి ప్రేమ విషయం గురించి ఎన్నోసార్లు కూడా తెలియజేసింది. దీంతో తాజాగా బంధుమిత్రుల సమక్షంలో చాలా సింపుల్ గా విరు వివాహం జరిగింది.
సాధారణంగా చిన్న హీరోలు హీరోయిన్స్ కూడా లక్షలలో ఖర్చు చేసి వివాహం చేసుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది స్టార్స్ వ్యాపారవేత్తలు పెళ్లిళ్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ అమృత రావు మాత్రం తన పెళ్లికి కేవలం రూ.1.5 లక్షల రూపాయలను మాత్రమే ఖర్చు చేసినట్లు తెలియజేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఈ కొత్తజంట తెలియజేయడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరు కొద్ది మరియు బంధుమిత్రుల సమక్షంలోని వీరి వివాహం జరిగిందని తెలిపారు.
ఇక తమ పెళ్ళికి అయినా ఖర్చును కూడా చాలా గర్వంగా చెప్పుకున్నారు. పెళ్లి బట్టలు కల్యాణ వేదిక వచ్చిన అతిధులకు భోజనాలన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే ప్లాన్ చేసుకున్నామని తెలిపారు. అమృత రావు పెళ్లిలో ధరించిన పెళ్లి ఖరీదు చీర కేవలం రూ .3000 రూపాయలే నట ఇక కళ్యాణమండపానుకు రూ .11వేల రూపాయలు అన్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక పెళ్లికి కేవలం లక్షన్నర రూపాయలు ఖర్చు అవడం అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.. సాధారణ జనాలు కూడా పెళ్లి అంటే కనీసం ఐదు లక్షలైనా ఖర్చు చేస్తూ ఉంటారు కానీ హీరోయిన్ అయ్యి ఉండి కూడా కేవలం రూ.3000 రూపాయల చీరతో వివాహం చేసుకోవడంతో ఈమె గొప్ప మనసుని అందరూ పొగిడేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: