రజిని 170వ మూవీ షూటింగ్ అప్పటినుండి ప్రారంభం... విడుదల అప్పుడు..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. రజిని చివరగా పెద్దన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందింది. ఈ మూవీ లో రజనీ కి సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటించగా ... మీనా , కుష్బూ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నయన తార ఈ మూవీ లో రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రజిని ... నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో తమన్నా , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రజిని  "జై భీమ్"  మూవీ దర్శకుడు అయినటు వంటి టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ... లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం జూలై మొదటి వారంలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదల చేయాలి అని ఈ మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: