విజయ్ దళపతి -68 చిత్రంపై క్లారిటీ ఇదే..!!

Divya
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వారసుడు చిత్రంతో తమిళ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ప్రస్తుతం తన 67వ చిత్రంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. తమిళ్ లో ఈ డైరెక్టర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కించిన గత చిత్రాలన్నీ కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం లియో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంజయ్ దత్ గౌతమ్ మేన తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు

తాజాగా విజయ్ తన 68వ సినిమా అకస్మాత్తుగా ప్రకటించడం జరిగింది. గత కొన్ని రోజులుగా విజయ్ తదుపరిచిత్రం ఏంటి అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు తో సినిమా ఉండబోతోంది అంటూ వార్తలు అయితే వినిపించాయి.. ఇటీవల నాగచైతన్యతో కష్టడి సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా పండగ ఆకట్టుకోలేకపోవడం వల్ల కలెక్షన్లు రాబట్టలేక పోయింది. ఇప్పుడు వెంకట ప్రభువు విజయ్తో సినిమా చేసే అవకాశాన్ని సంపాదించారు.

Ags ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డైరెక్టర్ వెంకట ప్రభు విజయ్ 68వ సినిమాలు ప్రకటించారు ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా విజయ్ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్ వెంకట ప్రభు ఈ సినిమాను ప్రకటిస్తూ తనకల నెరవేరబోతోంది అంటూ రాశారు సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఈ సినిమా మొదలవుతుందని విషయాన్ని తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలియజేయడం జరుగుతోంది. ఎట్టకేలకు విజయ దళపతి 68వ సినిమాపై క్లారిటీ రావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: