రాబోయే రీ రిలీజ్ చిత్రాలు ఇవే..!!

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోందని చెప్పవచ్చు. ఇక కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నాయి ముఖ్యంగా గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా విడుదలై బాగానే కలెక్షన్ రాబడుతూ ఉండడంతో నిర్మాతలు సైతం రీ రిలీజ్ సినిమాలను ఎక్కువగా విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమా విడుదల చేయడం జరిగింది అయితే ఈ సినిమా విడుదలైన పలు థియేటర్లలో కొంతమంది అభిమానులు థియేటర్ యాజమాన్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా కొన్ని పనులు చేయడం వల్ల రీ రిలీజ్ సినిమాలు విడుదల చేయాలంటే కాస్త భయపడుతున్నారు.

అయితే భవిష్యత్తులో రాబోయే  రీ రిలీజ్ సినిమాల విషయానికి వస్తే.. అందుతున్న సమాచారం మేరకు.. మహేష్ బాబు పూరి కాంబినేషన్లో వచ్చిన.. బిజినెస్ మాన్.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా.. అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య సినిమా.. రాజమౌళి హీరో ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా రాబోయే రోజుల్లో సినిమాలుగా వచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులు ఈ చిత్రాలకు మక్కువ చూపుతారు చూడాలి మరి.

అయితే ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమాలన్నీ కూడా ఈ హీరోల కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలన్నీ కూడా హీరోలకు మంచి క్రియేట్ తెచ్చి పెట్టడమే కాకుండా స్టార్ హీరోలుగా పేరు సంపాదించేలా చేశాయి. ఇప్పటివరకు హీరోల పుట్టినరోజున సందర్భంగా రీ రిలీజ్ చిత్రాలను విడుదల చేయడం జరిగింది. మరి ఈ చిత్రాలను ఎప్పుడు విడుదల చేస్తారు చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: