రీ రిలీజ్ లో భాగంగా మొదటి రోజు "సింహాద్రి" మూవీకి వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో సింహాద్రి మూవీ ఒకటి. ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... భూమిక , అంకిత ఈ సినిమాల్లో హీరోయిన్ లుగా నటించారు. ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించగా ... దర్శకుడు రాజమౌళి తండ్రి విజయవంత ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించాడు.

ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల ఆయి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఆ సమయంలో అదిరిపోయే రేంజ్ విజయం అందుకున్న ఈ సినిమాను తిరిగి ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20 వ తేదీన 4 కే వర్షన్ తో థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

ఈ మూవీ నైజాం ఏరియాలో రీ రిలీజ్ లో భాగంగా 1.06 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , సీడెడ్ లో 76 లక్షలు , యూఏ లో 27 లక్షలు , ఈస్ట్ లో 16 లక్షలు , వేస్ట్ లో 14 లక్షలు , గుంటూరు లో 19 లక్షలు , కృష్ణ లో 20 లక్షలు , నెల్లూరు లో 12 లక్షలు , కర్ణాటక లో 20 లక్షలు , తమిళ నాడు లో 10 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా లో 12 లక్షలు , యూఎస్ఏ లో 46 లక్షలు , జపాన్ లో 8 లక్షలు , రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 15 లక్షల కలక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.01 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే రీ రిలీజ్ లో భాగంగా సింహాద్రి మూవీ కి మొదటి రోజు అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు దక్కాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: