బిచ్చగాడు2: ఆ హీరో మూవీ కంటే ఎక్కువ వసూళ్లు?

Purushottham Vinay
2016 వ సంవత్సరంలో వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా 'బిచ్చగాడు'. మొదటి కథను సీనియర్ శశి తెర పైకి తీసుకు రాగా ఇప్పుడు విజయ్ ఆంటోనీ తన సొంత దర్శకత్వంలో  బిచ్చగాడు 2 ని తెరపై తీసుకోచ్చి అంచనాలని పెంచేసాడు.అప్పట్లో బిచ్చగాడు 1 తమిళంతో పాటు తెలుగు లో కూడా భారీ కలెక్షన్ల ను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆరంభం నుంచే ఈ బిచ్చగాడు 2 సినిమాపై అంచనాలు చాలా భారీగా ఏర్పడ్డాయి.'బిచ్చగాడు 2' సినిమాకి మార్కెట్ లో డిమాండ్ ఓ రేంజ్లో ఏర్పడింది. దీంతో ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ అన్నీ కూడా భారీ ధరలకు అమ్ముడపోయాయి. దాని ఫలితంగా ఈ క్రేజీ సీక్వెల్ తెలుగు తమిళ వెర్షన్లను కలుపుకుని అత్యధిక లొకేషన్లలో విడుదలవ్వడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఆరంభంలోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మిక్స్డ్ టాక్  వచ్చింది.'బిచ్చగాడు 2' సినిమాకి తెలుగు తో పాటు తమిళంలో కూడా మిశ్రమంగా మౌత్ టాక్ లభించింది.


అయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని బీ సీ సెంటర్ల ఆడియెన్స్ మాత్రం దీనికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫలితంగా ఫస్ట్ డే దీనికి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు రూ. 2.32 కోట్లు షేర్ ఇంకా రూ. 4.10 కోట్లు గ్రాస్ను వసూలు చేసింది.ఇవి రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీ మూవీ కంటే ఎక్కువ వసూళ్లు అనే చెప్పాలి.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన 'బిచ్చగాడు' మూవీ తమిళంలో మాత్రం గట్టి నిరాశనే ఎదుర్కొంది. ఈ సినిమాకి అక్కడ రూ. 1.50 కోట్లు వరకు మాత్రమే షేర్ లభించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా అంతగా ఆశించిన స్థాయిలో వసూళ్ల ను రాబట్టలేకపోయింది. ఇలా మొత్తంగా మొదటి రోజు మాత్రం రూ. 4.00 కోట్లు షేర్ ఇంకా రూ. 8.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.మిక్స్డ్ టాక్తో 'బిచ్చగాడు 2' మూవీ మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ను మంచిగానే రాబట్టుకోగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: