ఒకే ఒక్కడు సినిమాని వదులుకున్న.. స్టార్ హీరో ఎవరో తెలుసా?

praveen
కథ కథనం ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండాలే కానీ ఇక భాషతో సంబంధం లేకుండా సినిమా సూపర్ హిట్ సాధిస్తుంది అన్న విషయాన్ని నిరూపించే విధంగా ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఒక భాషకు మించి మరో భాషలో సూపర్ హిట్ అయింది అంటే చాలు అది పాన్ ఇండియా సినిమా అంటూ అందరూ ప్రశంసలతో ఆకాశానికెత్తేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. కానీ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దాదాపు 20 ఏళ్ల క్రితమే ఇక ఇలాంటి పాన్ ఇండియా సినిమాతో అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ సాధించాడు అన్న విషయం తెలిసిందే.

 శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చి సెన్సేషన్ సృష్టించిన సినిమా ఒకే ఒక్కడు.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతలా గర్జించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తమిళ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ను రాబట్టింది అని చెప్పాలి. దీనిబట్టి అప్పట్లో ఈ సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తమిళ్లో అర్జున్తో తెలుగులో మెగాస్టార్ తో తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్.

 ఇక ఈ విషయంపై అటు మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు కూడా జరిపాడట.కానీ శంకర్ ఒకే ఒక్కడు సినిమా చిత్రీకరణ జరిపే సమయంలో అటు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారట. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో చిరంజీవి కథ నచ్చిన కూడా ఈ సినిమాను వదులుకున్నారట. చివరికి ఇక తమిళంలో తెరకెక్కించిన  సినిమానే తెలుగులో డబ్ చేసిన శంకర్ అదే రేంజ్ లో హిట్ కొట్టాడు. ఇక ఈ విషయం తెలిసి ఒకవేళ చిరంజీవి గనుక ఈ సినిమా చేసి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ చెరిగిపోని రికార్డులు క్రియేట్ అయ్యేవని ఫాన్స్ అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: