పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి..!!
ముఖ్యమంత్రి పదవి అక్కరలేదు వెరీ గుడ్ చాలా బ్రహ్మాండంగా తెలియజేశారు..నాయకుడికి ఉండవలసిన లక్షణం ఇది నాయకుడు అనే వాడు ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉండకూడదు.. పవన్ ఆల్రెడీ ఒక నాయకుడు.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి రావడం ద్వారా కొత్తగా వచ్చింది ఏమీ లేదు.. ఆయన ఉండవలసిన ఇమేజ్ ఆయనకు ఉన్నది.. అంతటి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరో చేస్తే ముఖ్యమంత్రి అవ్వరు ఆయనంతట ఆయనే అవ్వాలనుకుంటే అవుతారు.. ఎవరు చేస్తే ముఖ్యమంత్రి అవ్వడం ఏంటి అంటూ.. ఆయన తలుచుకుంటే అంతే అని తెలిపారు తమ్మారెడ్డి.
కానీ జనం ఓట్లు వేయడం లేదని అనడం తనకు చాలా బాధ వేసిందని.. ఓట్లు వేయలేదంటే ఈయన సరిగ్గా ప్రయత్నం చేయలేదు..కనీసం ప్రచారం కూడా చేయలేదు ముఖ్యమైన నియోజకవర్గాలలో అసలు తిరగలేదు ఈయన చేయాల్సిన ప్రయత్నం చేయకుండానే జనం ఓట్లు వేయలేదని అంటున్నారు ..ఓటు వేయలేదు అనేది ఎంతవరకు నిజం అంటూ నిలదీశారు. కర్ణాటకలో ఎలక్షన్స్ లో కుమారస్వామి కూడా ఇలాగే అన్నారు.. ఎవరు గెలిచినా కూడా నేనే కింగ్ మేకర్ అవుతానంటూ తెలిపారు. కాని చివరికి నిల్ అయ్యారు రాజకీయాలలో కావాల్సింది కింగ్ మేకర్ కావడం కాదు కింగ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ నాలుగు సీట్లు గెలిచిన బ్లాక్ మెయిల్ చేసి ముఖ్యమంత్రి సీటు తీసుకొనే వ్యక్తి కాదు అలా అనుకోవడం కూడా చాలా తప్పు అంటూ తెలిపారు తమ్మారెడ్డి.