యుద్ధభూమిలో ఎదురుచూస్తున్న మిత్రమా.. హృతిక్ రోషన్ ట్విట్ వైరల్..!!

Divya
RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు కూడా వెలుబడుతూనే ఉన్నాయి. దీంతో అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్లో ఎన్టీఆర్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హృతిక్ రోషన్ తెలియజేస్తూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా హృతిక్ రోషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ట్విట్టర్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నానంటూ తెలియజేశారు. ట్విట్టర్లో హృతిక్ రోషన్ పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు ఈ ఏడాది మొత్తం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.. యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తున్నాను మిత్రమా..

రాబోయే రోజులు మీకు ఆనందంగా మరియు శాంతితో నిండి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. మనం కలిసే వరకు పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా అంటూ చేశారు హృతిక్ రోషన్. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగులో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు.తెలుగు హీరోకి హృతిక్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఇది మొదటిసారి.. దీంతో నందమూరి అభిమానులు సైతం తెగ ఖుషి అవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం దాదాపుగా ఒక్కో సినిమాకి రూ .100 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు ఎన్టీఆర్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: