రీ ఎంట్రీ కి సిద్ధం అవుతున్న హీరో తరుణ్...!!

murali krishna
కొద్దిరోజులుగా హీరో తరుణ్  సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన తల్లి దీనిపై స్పందించారు. ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
టాలీవుడ్ లవర్ బాయ్ గా హీరో తరుణ్ ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ’నువ్వే కావాలి‘, ’నువ్వు లేక నేను లేను‘, ’నువ్వే నువ్వే‘, ’ఎలా చెప్పను‘, ’నవ వసంతం‘ వంటి చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాలుగానూ నిలిచాయి.
2009 వరకు తరుణ్ కేరీర్ సాఫీగానే సాగింది. ’శశిరేఖ పరిణయం‘ తర్వాత నుంచి నామమాత్రం సినిమాలు చేశారు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత చివరిగా 2018లో ’ఇది నా లవ్ స్టోరీ‘తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. కనీసం పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎలాంటి అప్డేట్స్ అందడం లేదు.
ఇక రీసెంట్ గా తరుణ్ అమ్మగారు రమణి ఓ ఇంటర్వ్యూలో తరుణ్ గురించి చెప్పుకొచ్చారు. తర్వలోనే తరుణ్ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తరుణ్ ఓ వెబ్ సిరీస్, మరో మూవీకి సైన్ చేశారని చెప్పారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. దీంతో తరుణ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో త్రివిక్రమ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరిగిన అందులో వాస్తవం లేదని తెలిసింది.
పలువురు హీరోయిన్లతో అఫైర్స్ రూమర్లు, పలుమార్లు డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కోవడంతో సినిమాలకు కాస్తా దూరమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడిని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజులుగా తరుణ్ పెళ్లిపైనా వార్తలు వస్తున్నాయి. దీనిపైనా తరుణ్ తల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ’తరుణ్ కు భక్తి భావం ఎక్కువ. ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడు. తరుణ్ కి  పెళ్లి అయితే చాలనుకుంటున్నాను. అంతకు మించి నాకు పెద్ద కోరికలు లేవు‘ అంటూ స్పందించారు. ప్రస్తుతం తరుణ్ నాలుగు పదుల వయస్సుకు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: