హైయెస్ట్ వ్యూస్ ను సాధించిన టాప్ 5 మోషన్ పోస్టర్స్ ఇవే..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో సినిమాల నుండి మోషన్ పోస్టర్ లను చిత్ర బృందాలు విడుదల చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మంచి క్రేజ్ ఉన్న సినిమాల మోషన్ పోస్టర్ ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. దానితో ఈ మోషన్ పోస్టర్ లకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ వ్యూస్ లభిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన మోషన్ పోస్టర్ లలో విడుదల అయిన 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 3 మోషన్ పోస్టర్ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రస్తుతం "బ్రో" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా టైటిల్ ను విడుదల చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. దీనికి 24 గంటల సమయం ముగిసే సరికి 5.83 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోషన్ పోస్టర్ వ్యూస్ రికార్డ్ లన్నింటిని దాటి ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆల్ టైమ్ రికార్డ్ ను సృష్టించింది. ఈ మూవీ కి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందిన రాదే శ్యామ్ మూవీ లోని మోషన్ పోస్టర్ వీడియోకు 24 గంటల్లో 4.73 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ మూవీ కి రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ మోషన్ పోస్టర్ కు 24 గంటల్లో 4.64 మిలియన్ వ్యూస్ లభించాయి. ఆలియా భట్ , ఒలిబియా మోరీస్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించగా ... డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: