గబ్బర్ సింగ్ మూవీలో శృతిహాసన్ ను వద్దన్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మూవీ లలో గబ్బర్ సింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ లో పవన్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ టాలెంట్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయినటు వంటి హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించగా ... ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

ఈ మూవీ సల్మాన్ ఖాన్ హీరోగా సోనాక్షి సిన్హా హీరోయిన్ గా రూపొందినటు వంటి హిందీ సినిమా దబాంగ్ కు అధికారిక రీమేక్ గా రూపొందింది. దబాంగ్ మూవీ బాలీవుడ్ లో భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం ... అదే మూవీ ని తెలుగు లో రీమేక్ చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై మొదటి నుండే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీ ద్వారా శృతి హాసన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే ముందు పెద్ద చేర్చే జరిగిందట.

పవన్ "గబ్బర్ సింగ్" మూవీ లో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకోవాలి అని బండ్ల గణేష్ కు సూచించగా ... ఆ అమ్మాయికి వరసగా ఫ్లాప్ లు ఉన్నాయి ... వేరే ఎవరినైనా తీసుకుందాం అని బండ్ల గణేష్ ... పవన్ తో అన్నాడట. దానితో పవన్ నీకేమైనా పెద్ద హిట్స్ ఉన్నాయా ... చెప్పింది చెయ్యి అని చెప్పాడంట. అలాగే ఈ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ కూడా శృతి హాసన్ ను కాకుండా హీరోయిన్ గా వేరే అమ్మాయిని తీసుకుందాం అని అనగా ...  నేను ఆ అమ్మాయికి మాట ఇచ్చాను ... మాట ఇస్తే తప్పను. కచ్చితంగా ఆ అమ్మాయినే ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోండి అని అన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: