సిద్ధార్థ్ నటించిన టక్కర్ రిలీజ్ డేట్ లాక్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించారు నటుడు సిద్ధార్థ్. త్వరలోనే తను నటించిన టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జీ. క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణ సంస్థను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. జూన్ 9వ తేదీన తెలుగు తమిళ భాషలలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు ఈ చిత్రాన్ని.

సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ఎక్కువగా ప్రేమ సన్నివేశాలు అందరిని ఆకర్షించే విధంగా నిలుస్తూ ఉంటాయి. ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠ పరిచేయాల యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాన్స్ యాక్షన్స్ సన్నివేశాలు కూడా ఈ టీజర్ ని మరింత హైప్ ని తీసుకువచ్చాయి. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్తగా కనిపించబోతున్నారు అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన కయ్యాలి.. పెదవులు వీధి మౌనం పాటల కూడా పరవాలేదు అనిపించుకుంటున్నాయి..

ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్స్ మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు కూడా యువతను బాగా ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు మంచి హైట్ ఉందని చెప్పవచ్చు..సిద్ధార్థ్ ఈ సినిమాతో మరొకసారి భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘనవిజయాన్ని అందుకుంటారేమో సిద్ధార్థ్ చూడాలి మరి. చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరికి గుర్తుండి పోయేలా ఉంటుందని నమ్మకం తెలియజేస్తోంది. ఇందులో అభిమన్య సింగ్, యోగిబాబు, ఆర్జె విజ్ఞేశ్ తదితరులు ముఖ్యమైన పాత్రల నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఒక ట్విట్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: