ఆ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో "దసరా" హిందీ వర్షన్ మూవీ..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో మూవీ లలో నటించి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు దసరా అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 

సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ మార్చి 30 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా యొక్క తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్ లు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ లోకి అందుబాటు లోకి వచ్చాయి.

కాకపోతే ఈ మూవీ యొక్క హిందీ వెర్షన్ ను మాత్రం ఈ చిత్ర బృందం "ఓ టి టి" విడుదల చేయలేదు. తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువబడింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ హిందీ వర్షన్ ను మే 25 వ తేదీ నుండి నెట్ ప్లీక్స్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: