గోపీచంద్: ప్లాపులున్నా ఇంకా తగ్గని డిమాండ్?

Purushottham Vinay
టాలీవుడ్ లో మంచి యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు గోపీచంద్. హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా కూడా తన నటనతో ఎంతగానో మెప్పించారు. నిజం, వర్షం, జయం లాంటి సినిమాల్లో విలన్ గా ఒక రేంజిలో మెప్పించిన గోపి చంద్ ఆ తర్వాత యజ్ఞం మూవీతో మరోసారి హీరోగా రీ లాంచ్ అయ్యారు. యజ్ఞం సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ తర్వాత వరుసగా సినిమాలతో గోపి చంద్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా రామబాణం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో హాట్ బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇదిలా ఉంటే గోపీచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.


ఇక ఇదిలా ఉంటే గోపీచంద్ కు సరైన హిట్ లేకున్నా కూడా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదని తెలుస్తోంది. 2014 వ సంవత్సరంలో లౌక్యం మూవీతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన గోపీచంద్ ఆ తర్వాత ఒక్క హిట్టును కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. కానీ గౌతమ్ నంద సినిమా మాత్రం కమర్శియల్ గా ప్లాప్ అయినా చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాకి ఎన్నో ప్రశంసలు దక్కాయి.ఇప్పటికి ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయ్యిందా అని అభిమానులు ఎంతగానో బాధ పడుతూ ఉంటారు. ఈ సినిమాలో గోపి చంద్ అటు హీరో ఇటు విలన్ గా తన నట విశ్వ రూపం చూపించాడు.ఇక గోపీచంద్ రెమ్యునరేషన్ విషయానికొస్తే..గోపీచంద్ దాదాపు 5.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను  తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఫ్లాప్స్ లో ఉన్న హీరోకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ దక్కడం కూడా నిజంగా చాలా విశేషం అనే చెప్పాలి. ఇక గోపీచంద్ సాలిడ్ హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వస్తాడని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: