సాయి పల్లవి డాన్స్ పై ఆసక్తి కర కామెంట్ చేసిన సమంత...!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ప్రస్తుతం ఖుషి చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మెయిన్ రోల్ ను పోషిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీ గా ఉన్న సమంత. ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ‏గా కూడా ఉంటున్నారు. మోటివేషనల్ కోట్స్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో కూడా ఉంటారు. ఈ క్రమంలో తాజాగా సమంత కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియా లో బాగా వైరలవుతుంది. అందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారట
కెరీర్ ఆరంభంలో సమంత ఢీ డ్యాన్స్ షోకు ముఖ్య అతిథిగా అయితే హజరయ్యారు. అందు లో సాయి పల్లవి కంటెస్టెంట్‏గా పార్టిసిపేట్ చేసిందటా.. ఈ షోలో సాయి పల్లవి డ్యాన్స్ కు సామ్ ఫిదా అయిపోయింది. మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా కళ్లను అస్సలు తప్పించలేను. అద్భుతం గా చేశారు అంటూ సామ్ చెప్తుండగా.. సాయి పల్లవి థాంక్స్ అంటూ బదులిచ్చింది. ఈ వీడియో లో సామ్, సాయి పల్లవి లుక్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
ఫిదా తో తెలుగు తెర కు పరిచమయైన సాయి పల్లవి.. తొలి చిత్రంతోనే ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా నటనతోనే కాదు.. ఆమె డాన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. I. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే తన సహజ నటనతో సౌత్ ఆడియన్స్ హృదయాలు దొచేస్తోంది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి తన పాత్రకు ప్రాధాన్యత వున్న సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటి సినిమాలకు మాత్రమే డేట్స్ కేటాయిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: