మరో భారీ సినిమాలో నటించబోతున్న అల్లు అర్జున్..!!

murali krishna
ఆర్ ఆర్ ఆర్ మూవీ వచ్చి తెలుగు సినిమా స్థాయి నీ అమాంతం పెంచేసింది ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్లు కూడా తెలుగు హీరోల మీద ఫోకస్ పెడుతున్నారు అంటే నిజంగా మన ఇండస్ట్రీ టాప్ పొజిషన్ లో ఉంది అనడం లో ఎంత మాత్రం కూడా సందేహం లేదు…
టాలీవుడ్ స్టార్ హీరోలపై బాలీవుడ్ చూపు కూడా పడింది. బాలీవుడ్ నుంచి పలు భారీ ఆఫర్లు మన తెలుగు హీరోలను వెతుక్కుంటూ వస్తున్నాయని తెలుస్తుంది.. ఇప్పటికే ప్రభాస్ 'ఆదిపురుష్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ లో అయితే నటించాడు. ఈ సినిమా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందనున్న 'వార్-2' లో నటించనున్నాడట.. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చిందని తెలుస్తుంది.
'ఉరి'ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో 'ది ఇమ్మోర్టల్స్ అశ్వత్థామ'అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ రూపొందనుందట. మొదట విక్కీ కౌశల్ హీరోగా రోనీ స్క్రూవాలా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలి అయితే అనుకున్నారు. కానీ ఆ తర్వాత జియో స్టూడియోస్ రంగంలోకి దిగింది. ఇక హీరోగా విక్కీ కౌశల్ కి బదులుగా రణ్ వీర్ సింగ్  నటించే అవకాశముందని న్యూస్ కూడా వినిపించింది. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు కూడా బాగా వినిపించాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పేరు దాదాపు ఖరారైందని తెలుస్తోంది.'పుష్ప'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆయన నటిస్తున్న 'పుష్ప-2' కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తే సౌత్, నార్త్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా మొత్తం రీచ్  ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే తాజాగా 'అశ్వత్థామ' మేకర్స్ అల్లు అర్జున్ ని కలిశారట. అశ్వత్థామగా నటించడానికి అల్లు అర్జున్ ఆసక్తిగానే ఉన్నప్పటికీ, ఇంకా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది.. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఆయన ఓకే చెప్పే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగి అశ్వత్థామగా నటించడానికి అల్లు అర్జున్ ఓకే చెప్తే.. ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు కూడా ఓ రేంజ్ కి వెళ్తాయి అనడంలో సందేహం  అయితే లేదు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: