ఆదిపురుష్: ఫస్ట్ వీక్ 1000 కోట్లు పక్కా?

Purushottham Vinay
ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటైన 'ఆదిపురుష్' సినిమా అతి త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఇక రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ విపరీతమైన ఆదరణ పొందుతున్నది.ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ ఇంకా అలాగే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషించారు.ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓపెనింగ్ ఇంకా బాక్సాఫీస్ కలెక్షన్లకు సంబంధించి బాలీవుడ్ నటుడు అలాగే సినీ విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ స్పందించాడు.ఈ సినిమా మొదటి రోజు రూ. 150 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అతను చెప్పాడు. KRK తనను తాను ట్రేడ్ అనలిస్ట్‌గా భావించి బాలీవుడ్ నటులు ఇంకా వారి చిత్రాల గురించి తన అభిప్రాయాన్ని తరచూ తెలియజేస్తూ ఉంటాడు.


దాదాపు ప్రతి విషయంలో కూడా తన అభిప్రాయాన్ని చెబుతూనే ఉంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఈ విషయం  చెప్పడం జరిగింది.ఇక ఆదిపురుష్ ఇండియాలోనే మొదటి రోజు రూ.150 కోట్ల వసూలు చేయనుందని కమల్ రషీద్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.ఈ సినిమా ఖచ్చితంగా తొలి వారంలో రూ.1000 కోట్లు రాబడుతుందని పేర్కొన్నాడు.సౌత్ లో షారుక్ ఖాన్ కంటే ప్రభాస్ కి చాలా ఎక్కువ క్రేజ్ ఉంది .కేఆర్‌కే చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి చూడాలి ఇక ఈ ఆది పురుష్ సినిమా బాహుబలి రికార్డులని బ్రేక్ చేసి సరికొత్త రికార్డులని సృష్టిస్తుందో లేదో..బాహుబలి సెరీస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం జరిగింది. ఇక ఈ రికార్డుని ఆది పురుష్ సినిమా ఈజీగా బ్రేక్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: