ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సూపర్ స్టార్....!!

murali krishna
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఇది చేదువార్తే అని చెప్పాలి. తలైవా సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక బస్సు కండక్టర్ వృత్తి నుంచి సినిమా రంగంలోకి విలన్ గా అడుగుపెట్టి, హీరోగా, స్టార్ గా, సూపర్ స్టార్ గా రజినీ ఎదిగిన వైనం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఆయన వ్యక్తిత్వం అంతకన్నా గొప్పది. నిరాడంబరానికి నిలువెత్తు నిదర్శనం రజినీ. ప్రస్తుతం ఆయన వయస్సు 72..ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు 170. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ రజినీ ఆరోగ్యం కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ మధ్యనే ఆయనకు ఒక సర్జరీ కూడా జరిగింది. ఇక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రజినీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 171 వ సినిమా ఒకటి చేసి.. ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారట. ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కాకుండా కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం అనే సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు సినిమాలతో కలిపి తలైవా 170 సినిమాలు పూర్తీ చేసినట్లు.. ఇక రజినీ 171 వ సినిమాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అదే ఆయన చివరి చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమా తరువాత రజినీ.. సినిమాలా నుంచి తప్పుకొని పూర్తిగా ఇంటికి పరిమితమవుతారని చెప్పుకొస్తున్నారు. ఇదే మాటను తలైవా.. సన్నిహితుల వద్ద కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇంతకన్నా చేదు వార్త మరొకటి ఉండదు. ఈ వార్త విన్నాకా.. రజినీ అభిమానులు బాధపడుతున్నా.. ఆయన ఆరోగ్యం దృష్ట్యా.. వారు కూడా ఓకే అంటున్నట్లు సమాచారం. మరి ఈ విషయమై రజినీ ఏమంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: