పుష్ప 2 నుంచి పూనకాలు తెప్పించే మరొక అప్డేట్ ...అదరగొట్టేసారుగా !

praveen

పుష్ప.. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ని పాన్ ఇండియా స్థాయిలో పెంచింది ఈ చిత్రం. టాలీవుడ్ మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వట్టి హిట్ కాదు బాలీవుడ్ ఆఫీస్ దుమ్ము దులిపింది. భారీ స్థాయిలో వసూల్లను సాధించిన ఈ చిత్రాన్ని రెండు పార్టులాగా విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. స్మగ్లింగ్ అనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనేక భాషలకు సంబంధించిన పెద్ద స్టార్స్ నటించారు. అయితే పుష్ప పార్ట్ 1  ఘానవిజయం సాధించిన తర్వాత పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు సుకుమార్.


 ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు అప్డేట్స్ వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించారు. ఇక పార్ట్ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ హీరో పాహద్ ఫజిల్ నటించాడు. ఆయన భన్వర్ సింగ్ షెకావత్ అనే ఒక పోలీస్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. మొదటి పార్ట్ లో ఆయన కనిపించే సన్నివేశాలు, నిడివి తక్కువే అయినప్పటికి, రెండవ పార్ట్ లో మాత్రం ఆయన్ని పూర్తి స్థాయిలో వాడుకోబోతున్నాడు సుకుమార్. షెకావత్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా ఫినిష్ చేశాడు.


 అందుకు సంబంధించిన ఒక పోస్ట్ కూడా సుకుమార్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. లొకేషన్ లో మానిటర్ ని సీరియస్ గా చూస్తున్న డైరెక్టర్ మరియు ఫాహద్ పజిల్ ఈ పోస్ట్ లో కనిపిస్తున్నారు. ఈసారి ఆయన ప్రతీకారంతో తిరిగి వస్తాడు అనే క్యాప్షన్ ఇచ్చి సుకుమార్ సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫోటోని షేర్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాకి సంబంధించి పార్టీ లేదా పుష్ప అనే ఒక డైలాగ్ సెన్సేషనల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: