OG సినిమా పైన పవన్ కళ్యాణ్ కు నమ్మకం ఉందా..!!

Divya
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్సులో షూటింగ్ కూడా పూర్తి చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సినిమా నుంచి అప్డేట్ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూనే ఉన్నాయి. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ ఒక సినిమా అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ఇలా సినిమాల పైన అప్డేట్ ఇస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఈ అప్డేట్స్ అన్నీ కలిపి ఎంత హైపు ఇస్తున్నాయో అంతే హైపుని మించి పోయాలా సినిమాలు కిక్కిస్తున్నాయి.
గ్యాంగ్ స్టార్ డ్రామా తెరకెక్కిస్తున్న OG సినిమానీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం చేస్తున్నారు.ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ హీరో అని డైరెక్టర్ సుజిత్ తన ఫేవరెట్ హీరోని ఏ రేంజ్ లో చూపిస్తారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా పైన రోజురోజుకి ఎక్స్పెక్టేషన్ పెంచేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా షూటింగ్ విషయం పైన కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నారు చిత్ర బృందం.

ముంబైలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా అక్కడ ఒక ఫైట్ అండ్ సాంగ్ షూటింగ్ జరుపుకున్నారు. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉన్నది. ఈ షెడ్యూల్ అయిపోయిన వెంటనే టైటిల్ అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ చేయడం జరిగింది..OG పై తాజాగా మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ షెడ్యూల్ ఈరోజు హైదరాబాదులో మొదలవుతోంది అంటూ ట్విట్టర్ వేదికగా డివివీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో అభిమానుల సైతం పవన్ కళ్యాణ్ ఇతర చిత్రాల కంటే ఈ సినిమా పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారని అందుకే ఇంతలా షూటింగ్ని స్పీడ్ గా పూర్తి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: