కీర్తి సురేష్ లైఫ్ పార్ట్నర్ అతడేనా...?

murali krishna
మహానటి కీర్తి సురేష్ గురించి అందరికి కూడా తెలుసు.. ఈమె నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మహానటి సినిమా  ద్వారానే స్టార్ హీరోయిన్ అయింది
ఇక ఇటీవలే సర్కారు వారి పాట మరియు దసరా వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న కీర్తి ఫుల్ జోష్ లో అయితే ఉంది.. వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంది.ఇదిలా ఉండగా ఈమె కెరీర్ సంగతి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా ఈమె పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరోసారి ఈమె పెళ్లి వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో దిగిన ఫోటోను అయితే షేర్ చేసింది.
ఈ ఫోటో చూసిన వారంతా ఈమెకు కాబోయే అతడు ఈయనేనా అనే డౌట్ కూడా మొదలయ్యింది. అతడు అంత సున్నిహితంగా ఉండడంతో ఈయన ఖచ్చితంగా కీర్తి లవర్ అనే అంతా కూడా అనుకుంటున్నారు. అతడు ఎవరు అని ఆరా తీయగా.. అతడి పేరు ఫర్హాన్ లియాఖత్ అని అయితే తెలుస్తుంది. ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అని కీర్తి తో అందం, ఆస్తి లో సరితూగిన వ్యక్తి అని సమాచారం.ఈయన తోనే కీర్తి పెళ్లి అంటూ టాక్ నడుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ మాత్రం తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నెట్టింట ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రజెంట్ ఈమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.. తెలుగులో భోళా శంకర్ లో ఆమె నటిస్తుంది.. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో ఈమె నటిస్తుండ గా ఆగస్టు 11న విడుదలకి సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: