బిచ్చగాడు 2 సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందా...?

murali krishna
విజయ్ ఆంటోనీ  ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం.. అయితే ఇంతకు ముందు ఇతడు ఎవరో కూడా అస్సలు తెలియదు.
కానీ ఒకే ఒక్క సినిమా తో తెలుగు లో  బాగా ఫేమస్ అయ్యాడు.. మరి ఆ సినిమా ఏంటో కూడా తెలుగు ప్రేక్షకులకు తెలుసు..ఆ సినిమానే బిచ్చగాడు.. ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్షనల్ హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు..
అప్పటి వరకు విజయ్ ఆంటోనీ ఎవరో కూడా తెలియక పోయిన బిచ్చగాడు సినిమాలో ని కంటెంట్ కారణంగా మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ను బాగా ఆదరించారు. మరి అలాంటి బిచ్చగాడు సినిమా కు సీక్వెల్ రాబోతుంది.. ప్రియా కృష్ణ స్వామి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుందట.. ఈ లోపులోనే ఈ సినిమా ప్రివ్యూ ను కూడా వేశారు. విజయ్ ఆంటోని కి తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు, కొంత మంది మీడియా మిత్రుల మధ్య ఈ సినిమా తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రివ్యూ ను వీక్షించారట.. ఈ ప్రివ్యూ చూసిన వారంతా విజయ్ నటనను మెచ్చుకుంటూ బిచ్చగాడు 2 మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంది అని పాజిటివ్ గా రెస్పాన్స్ చెబుతున్నారు.
ఈసారి విజయ్ ఆంటోనీ బ్రెయిన్ మార్పిడి ప్రయోగం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కోణంలో కథా కథనాలను డైరెక్టర్ తీర్చి దిద్దినట్టు అయితే తెలుస్తుంది.. అలాగే ఈ సినిమా ఎమోషన్స్ చుట్టూ సాగే కథ అని ఇందు లో నటించిన వారంతా కూడా తమ పాత్రల్లో జీవించారని అంటున్నారు. మరి విడుదల తర్వాత కూడా ఈ సినిమా ఇదే టాక్ తెచ్చుకుంటే మాత్రం మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: