ఆది పురుష్ సినిమా రన్నింగ్ టైం ఎంతో తెలుసా...?

murali krishna
పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ 'ఆదిపురుష్
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో అయితే నిర్మించింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా  నటిస్తున్నారట...
ఇదిలా ఉండగా ఈ సినిమా జూన్ 16న గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.. మరి విడుదల కు మరో నెల కూడా సమయం లేకపోవడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువుగా ప్రమోట్ చేస్తున్నారట.
దీంతో ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ కూడా ఏర్పడ్డాయి.. ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి..మొదటిసారి ప్రభాస్ బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఇది పక్కా హిట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నారు.. ఎందుకంటే ఇది హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో మరింత క్రేజ్ ను పెంచుకునేందుకు ఆస్కారం ఉంది.. అందుకే ఈ సినిమా రికార్డ్స్ కలెక్షన్స్ రాబట్టాలని అయితే కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంత అనేది బయటకు వచ్చింది. ఓవర్సీస్ వర్గాల నుండి ఈ సినిమా రన్ టైం ఎంతో బయటకు వచ్చింది.. ఈ సినిమాకు 2 గంటల 54 నిముషాల రన్ టైం ఉందని తెలుస్తుంది.మరి రామాయణం లాంటి మహా చరిత్రను తక్కువ సమయంలో పూర్తి చేయలేరని తెలుస్తుంది..అందుకే ఈ సినిమాకు దగ్గర దగ్గరగా మూడు గంటల నిడివి వచ్చేసిందని సమాచారం... ఈ మూడు గంటలు ఆడియెన్స్ కు నెక్స్ట్ లెవల్ ట్రీట్ ఉంటుంది అని తెలుస్తుంది..అసలే సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ప్లాప్ అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అయిన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు అని ఫ్యాన్స్ కూడాఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభాస్ ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబట్టి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: