"ఝుమ్మంది నాదం" సినిమా సమయంలో నరకం అనుభవించాను... తాప్సి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటువంటి తాప్సి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మంచు మనోజ్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందినటువంటి ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెర కు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో తాప్సి ఆరబోసిన అందచందాలకు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అలా ఈ మూవీ లో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను తాప్సి ఆకట్టుకోవడంతో ఆ తర్వాత తాప్సి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలు దక్కాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలు దక్కుతున్న సమయం లోనే తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో హిందీ సినిమా లలో నటించిన తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం తాప్సి ఓ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసలు విషయం లోకి వెళితే ... చాలా రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూ లో నా ఫస్ట్ మూవీ కి సీనియర్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నన్ను రాఘవేంద్రరావు గారు ఎంతో అందంగా చూపించారు. ఆ సినిమా ద్వారా నాకు అద్భుతమైన గుర్తింపు లభించింది. కాకపోతే ఆ సినిమాలో నన్ను అందంగా చూపించాలి అనే ఉద్దేశంతో నాతో వేయించిన కాస్ట్యూమ్స్ నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి. అలాగే అవి వేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నరకం కూడా చూసేదాన్ని  అని తాప్సి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: