ఆ హీరో తో సినిమా చేసే సమస్యే లేదు :: రాజమౌళి

murali krishna
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , ఆ తర్వాత 'శాంతినికేతన్' అనే టీవీ సీరియల్ కి దర్శకత్వం వచ్చింది, అక్కడ వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో దర్శకత్వం చేసే ఛాన్స్ ని సంపాదించిన దర్శకుడు రాజమౌళి.
స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో ప్రారంభమైన ఆయన కెరీర్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో మనం చూస్తూనే ఉన్నాము.ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అయ్యి మగధీర చిత్రం నుండి వేరే లెవెల్ కి వెళ్లిపోయేలా చేసింది.అప్పటి వరకు రాజమౌళి కేవలం నలుగురిలో ఒక స్టార్ డైరెక్టర్ మాత్రమే. కానీ మగధీర చిత్రం నుండి ఇండస్ట్రీ కి నెంబర్ 1 స్టార్ డైరెక్టర్ అయ్యాడు.మగధీర చిత్రం నుండి రాజమౌళి( rajamouli ) తో ఒక్క సినిమా చెయ్యడానికి పరితపిస్తుంటారు స్టార్ డైరెక్టర్స్. ఇప్పటి వరకు ఆయన ఇండస్ట్రీ లో ఉన్న టాప్ 6 హీరోలలో ఎన్టీఆర్, రామ్ చరణ్ , ప్రభాస్ తో రిపీట్ గా సినిమాలు చేసాడు.
త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు, ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మాత్రమే. పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యడానికి రాజమౌళి అప్పట్లో చాలా ప్రయత్నాలే చేసాడు. పంజా సినిమా షూటింగ్ సమయం లో రాజమౌళి పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక స్టోరీ చెప్పాడు. ఇద్దరు కలిసి పని చేద్దాం అని అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఎవరికీ వారు వాళ్ళ సొంత ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల రాజమౌళి తో సినిమా చెయ్యలేకపోయాడు.ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు రాజమౌళి అల్లు అర్జున్తో  ఒక్క సినిమా కూడా చెయ్యడానికి ఆసక్తి చూపలేదట. కనీసం వీళ్ళ మధ్య ఇప్పటి వరకు చర్చలు కూడా జరగలేదని అంటున్నారు.టాలెంట్ కి పర్యాయపదం లాగ ఉండే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమాలు చేయకపోవడానికి కారణం ఇదే అని ఇండస్ట్రీ లో ఒక టాక్ జోరుగా సాగింది. మగధీర సినిమా షూటింగ్ సమయం లో అల్లు అరవింద్ మరియు రాజమౌళి కి మధ్య చిన్న ఈగో క్లాషెస్ వచ్చాయట.తనకి పేరు దక్కకుండా, మొత్తం మా వల్లే ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మితమైంది అనే విధంగా అల్లు అరవింద్ అప్పట్లో ప్రవర్తించిన తీరు రాజమౌళి కి ఏమాత్రం నచ్చలేదట. అందుకే ఆయన మగధీర విజయోత్సవ సభకి కూడా హాజరు కాలేదు. అప్పటి నుండి రాజమౌళి అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో కానీ, అలాగే అల్లు అర్జున్ తో కానీ సినిమాలు చేసే సమస్యే లేదని తెగేసి చెప్పేవాడట తన సన్నిహితులతో. అలా వీళ్లిద్దరి కలయిక ని చూసే అదృష్టాన్ని కోల్పోయారు మన తెలుగు ఆడియన్స్, భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరు కలిసి సినిమాలు చేస్తారో లేదో చూడాలి. అయితే రాజమౌళి సహాయం లేకుండానే అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ కీ ఎదిగాడు, పుష్ప సినిమా తో ఆయన ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు.ఇప్పుడు ఆయన నటిస్తున్న పుష్ప 2 కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: