ఈ ఏడాది రూ.100 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాలు..!!

Divya
ఏ ఇండస్ట్రీలో నైనా ఈ మధ్యకాలంలో సినీ థియేటర్లకు వెళ్లాలంటే ప్రేక్షకులు సైతం కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు. వారు పెట్టిన డబ్బుకు సినిమా న్యాయం చేయలేకపోతే డబ్బు వృధాగా భావిస్తున్నారు. అంతేకాకుండా థియేటర్ లోపలికి వెళ్లిన తర్వాత పాప్కాన్ పేరుతో మరింత బాదుతు ఉన్నారు థియేటర్ యాజమాన్యం. దీంతో ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లాలి అంటే కాస్త ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో ఎక్కువగా ఫ్యామిలతో వెళ్లేవారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓటిటి మీదే ఎక్కువగా మక్కువ చుపుతున్నారు.

దీంతో థియేటర్ల పరిస్థితి కూడా మరింత దిగజారి పోతుందని చెప్పవచ్చు. కొన్నిచోట్ల థియేటర్లను మూసివేయడం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో కూడా ఈ ఏడాది అభిమానులను మెప్పించి రూ .100 కోట్ల రూపాయల వసూలు సాధించిన ఇండియన్ సినిమాలు గురించి ఒకసారి తెలుసుకుందాం.. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో వాల్తేర్ వీరయ్య చిరంజీవి సినిమా కూడా రూ .100 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది ఆ తర్వాత అజిత్ నటించిన తునివు.. విజయ్ దళపతి నటించిన వారిసు.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రం.. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్.. ధనుష్ నటించిన సార్.. నాని నటించిన దసరా.. అజయ్ దేవగన్ నటించిన భోళా సినిమా మణిరత్నం తెరకెక్కించిన పోన్నియన్ సెల్వన్ -2.. తాజాగా ఆదాశర్మ నటించిన ఈ కేరళ స్టోరీ.. అలాగే 2018 చిత్రం.. అలాగే తూ జోతి మైన్ మక్కార్ వంటి చిత్రాలు ఇప్పటివరకు 100 కోట్లు మార్కును అందుకున్నాయి.

ఇదే కాకుండా చాలా సినిమాలు విడుదలయ్యాయి కనీసం అందులో పెట్టిన ప్రమోషన్స్ ఖర్చులు కూడా రాలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువగా సస్పెక్ట్ త్రిల్లర్ చిత్రాలకు మాత్రమే బాగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. మరి ఈ ఏడాది ముగిసేలోపు ఎన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: