మళ్లీ రెచ్చిపోయిన మృణాల్..!

shami
ఆడియన్స్ ని తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది సీతామహాలక్ష్మి. అదే సీతారామం సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో సో సో గానే క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు తెలుగులో ఒక్క సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. సీరియల్స్ నుంచి సినిమాల దాకా ఆమె చేసిన ప్రయాణంలో సీతారమం సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇలా వచ్చిన తన క్రేజ్ ని మరింత పెంచేలా అమ్మడు ఫోటో షూట్స్ చేస్తుంది.
ఓ రేంజ్ లో అందాలను గుమ్మరిస్తూ మృణాల్ చేస్తున్న ఫోటో షూట్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. లేటెస్ట్ గా బ్లాక్ కలర్ డ్రెస్ లో అమ్మడు చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లను డిస్టర్బ్ చేస్తుంది. తాను చేస్తున్న సినిమాల కన్నా ఇలా ఫోటో షూట్స్ విషయం లో మృణాల్ ది బెస్ట్ అనిపిస్తుంది. ఓర కళ్ల తో మత్తెక్కించే అమ్మడి చూపులు బాబోయ్ మృణాల్ ఏంటిది నువ్విలా రెచ్చిపోతే మా పరిస్థితి ఏంటమ్మడు అంటూ క్రేజీ కామెంట్స్ పెట్టేస్తున్నారు నెటిజన్లు. అమ్మడు ఫోటో షూట్స్ విషయంలో మాత్రం రాజీ పడేదేలే అన్నట్టు ఉంది.
చేసిందేమో సీత పాత్ర.. వచ్చిందేమో క్లాస్ ఇమేజ్ అలాంటి అమ్మడు ఫోటో షూట్స్ తో రెచ్చిపోవడం మాత్రం ఆడియన్స్ ని నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే మృణాల్ ప్రస్తుతం నాని 30 వ సినిమాలో నటిస్తుంది. శౌర్యువ్  డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని మృణాల్ కలిసి జత కడుతున్నారు. ఈ సినిమాతో మరోసారి మృణాల్ తన సత్తా చాటుతుందని అంటున్నారు. నాని మృణాల్ ఇందులో భార్యా భర్తలుగా కనిపిస్తారట. వెరైటీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా తో మృణాల్ మెప్పించాలని చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: