నవదీప్ పరువు తీసేసిన అల్లు వారసుడు....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నేటి తరం హీరోల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అభిమానులు ఎలా ఉన్నా, హీరోలు మాత్రం అన్నదమ్ములు లాగ కలిసి మెలిసి ఉంటారు.
అలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి  ఇండస్ట్రీ లో పెద్ద గ్యాంగ్ ఉంది.ఆ గ్యాంగ్ లో నవదీప్ కూడా ఒకడు, కెరీర్ ప్రారంభం నుండే వీళ్ళు మంచి స్నేహితులు.
హైదరాబాద్ లో పార్టీ కల్చర్ ని అందరూ బాగా ఫాలో అవుతూ ఉంటారు, అల్లు అర్జున్ మరియు నవదీప్ కూడా అలంటి వాళ్ళే.ప్రతీ వారం పార్టీలలో కలుస్తూ ఉండే వీళ్ళు అలా స్నేహితులు కూడా అయ్యారు.వీళ్లిద్దరు కలిసి ఇది వరకు ఆర్య 2 మరియు అలా వైకుంఠపురం లో వంటి సినిమాలలో నటించారు.ఈ రెండు సినిమాలలో ఆర్య 2  చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడగా, అలా వైకుంఠపురం లో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.
ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ తో తనకి జరిగిన ఒక సంఘటన గురించి నవదీప్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.ఆయన మాట్లాడుతూ చందమామ సినిమా విడుదల రోజు నేను నా గ్యాంగ్ లో ఉన్న 30 మంది స్నేహితులకు ఒక థియేటర్ లో రో మొత్తం టికెట్స్ బుక్ చేసి తీసుకెళ్ళాను.ఆ 30 మంది స్నేహితులలో అల్లు అర్జున్ మరియు శిరీష్ కూడా ఉన్నారు.
అయితే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో నేను కాజల్ తో అలాంటి పనులన్నీ చేసేసిన తర్వాత, ఆమె వెంటనే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అంటుంది, అప్పుడు నేను పెళ్లి లాంటి ఆలోచనలు లేవు, మళ్ళీ ఇలాంటివి కావాలంటే చెప్పు చేసుకుందాం అంటాను, ఆ సన్నివేశం గుర్తు ఉంది కదా?, థియేటర్ లో ఆ సన్నివేశం వచ్చినప్పుడు అల్లు అర్జున్ పైకి లేచి విజిల్స్ వేసాడు, రేయ్ నీ నిజమైన క్యారక్టర్ ని భలే తీశారు రా అని గట్టిగా అరిచాడు, ఒరేయ్ పరువు తియ్యకు రా బాబు కూర్చో అని చెప్పాను అంటూ నవదీప్ ఈ సంఘటనని ఈ సందర్భంగా పంచుకున్నాడు.
అలా మా ఇద్దరి మధ్య ఎన్నో ఫన్నీ సంఘటనలు చోటు చేసుకున్నాయని నవదీప్ ఈ సందర్భంగా తెలిపాడు.ఇప్పుడు అల్లు అర్జున్ పెద్ద పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు, అయినప్పటికీ కూడా ఒకప్పుడు నాతో ఎలా ఉండేవాడో, ఇప్పటికీ అలాగే ఉన్నాడు.ఇప్పటికీ మేము వీకెండ్స్ లో సమయం దొరికినప్పుడల్లా కలుస్తుంటాము, బాగా ఎంజాయ్ చేస్తాము అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: