కీలక అప్డేట్ తో వచ్చిన బాలయ్య - అనిల్ మూవీ ......!!

murali krishna
నంద‌మూరి బాల‌కృష్ణ  నటిస్తోన్న తాజా చిత్రం ఎన్‌బీకే 108. ఇప్పటికే బాలకృష్ణ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్ర లో నటిస్తోన్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి  దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో బాలకృష్ణ ఈ సారి కూడా రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న లుక్స్‌లో కనిపించ బోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్‌.
మాస్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఎన్‌బీకే 108లో కాజల్ అగర్వాల్‌  ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ చిత్రం లో పెళ్లి సందD ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీలీల ఇందు లో బాలయ్య కూతురు గా కనిపించబోతున్నట్టు ఇప్పటిదాకా వార్తలు హల్‌ చల్ చేస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి మరో వార్త తెరపై కి వచ్చింది.
శ్రీలీల ఈ మూవీలో బాలకృష్ణ స్నేహితు డి కూతురు గా కనిపించనుందట. ఇంత కీ బాలకృష్ణ స్నేహితుడె వరనే కదా మీ డౌటు.. స్టార్ యాక్టర్ శరత్‌కుమార్‌. అంతేకాదు సినిమా లో ఓ ట్విస్ట్‌ ఉండబోతుండగా.. బాలకృష్ణ, శ్రీలీల మధ్య బాండింగ్‌ స్టోరీ లో చాలా కీలకం గా సాగునుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇప్పటి వరకు రాయలసీయ యాసలో అలరించిన బాలకృష్ణ.. ఈ సారి మాత్రం పక్కా తెలంగాణ యాస లో ఎంటర్ ‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలియ జేశాడు అనిల్ రావిపూడి.
ఈ మూవీని షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎస్‌ థమన్‌ మరోసారి అదిరిపోయే బీజీఎం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ఎన్‌బీకే 108 షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌లో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: