నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గ నిలిచిన "దసరా" మూవీ... ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్లు..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తెలుగు సినిమా ఇండ స్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే ఊర మాస్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి ఇతర భాషలతో పోలిస్తే తెలుగు భాషలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి.

ఈ మూవీ ఇప్పటి వరకు నాని కెరియర్ లో ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో కలెక్షన్ లను సాధించి నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను సాధించిన మూవీ గా నిలిచింది. ఈ మూవీ మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 63.55 కోట్ల షేర్ ... 115.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని నాని మరియు కీర్తి సురేష్ నటన లకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే కొత్త దర్శకుడు అయినప్పటికీ ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ సినిమా దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెల కు కూడా ఈ మూవీ కి గాను అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా ఈ సినిమా భారీ కలక్షన్ లను వసూలు చేసి నాని కెరియర్.లో హైయెస్ట్ కలక్షన్ లను వసులు చేసిన మూవీ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: