"టైగర్ నాగేశ్వరరావు" మూవీ ఫస్ట్ లుక్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవితేజ పోయిన సంవత్సరం ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలలో ధమాకా మూవీ మంచి విజయం సాధించగా మిగతా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయినటువంటి వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించాడు.
 

ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించగా శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను మే 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. రవితేజ కెరియర్ లో రూపొందుతున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: