ఆ పెద్ద హీరోతో నెక్స్ట్ సినిమా చేయనున్న కస్టడీ డైరెక్టర్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లేటెస్ట్ గా నటించిన మూవీ ''కస్టడి''. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 12న తెలుగు తమిళ భాషల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు  దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.. తెలుగు, తమిళ్ లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ బైలింగ్వన్ మూవీను శ్రీనివాస చిట్టూరి నిర్మించగా.. ఇళయరాజా ఇంకా యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు. కస్టడీ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్న ఈ తమిళ్ డైరెక్టర్ అయితే తన టేకింగ్ విషయంలో గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.వెంకట్ ప్రభుకి సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా మంచి గుర్తింపు వుంది. ఈయన సినిమాలు కొన్ని కోలీవుడ్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే విధంగా నిలిచిపోయాయి.కలెక్షన్స్ తక్కువగా వస్తున్న కస్టడీ మూవీ చాలా బ్రిలియంట్ గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.


వెంకట్ ప్రభుకి ఇక ఈ సినిమా తర్వాత ఈయన నెక్స్ట్ ఏంటి అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈయన తన నెక్స్ట్ సినిమాను ఓ పెద్ద స్టార్ హీరోతో చేయబోతున్నట్టు టాక్.. మరి ఆ స్టార్ ఎవరో కాదు కోలీవుడ్  స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దళపతి. ఈయనతో సినిమా ఓకే చేసేందుకు సన్నాహాలు కూడా జరుగు తున్నట్టు తెలుస్తుంది.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ ఈ కాంబోలో వచ్చే సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం తెలుస్తుంది.. తలపతి విజయ్ కెరీర్ లో ఈ సినిమా 68వ సినిమాగా తెరకెక్కనుంది.. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అనేది చూడాలి.. ప్రస్తుతం  విజయ్ తన 67వ సినిమాను లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. లియో అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: