కోటి పెడితే.. బలగం సినిమాకి ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

praveen
ఒకప్పుడైతే కమర్షియల్ సినిమాలకే ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టేవారు. కానీ ఇప్పుడు రియలిస్టిక్ గా ఉన్న సినిమాలనే ఎక్కువగా చూడ్డానికి ఇష్టపడుతున్నారు. స్టార్ హీరోలు లేకపోయినా పర్వాలేదు. కథలో బలం ఉంటే చాలు అని అనుకుంటున్నారు. దీంతో ఇక మంచి కథతో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా ఇటీవల కాలంలో చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్స్ సృష్టించింది బలగం సినిమా. జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్షన్లో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్రామ్ హీరో హీరోయిన్ లుగా వచ్చిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయినా సినిమాకు మారింది.

 పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో సహజ సిద్ధమైన క్యారెక్టర్లతో పాత రోజులను గుర్తు చేసే సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించి నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టింది. బలగం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి 1.15 కోట్ల బిజినెస్ జరిగిందట. కానీ ఈ సినిమాకు మాత్రం ఊహించని స్థాయిలో భారీ కలెక్షన్లు వచ్చాయట. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో 9.5 కోట్లు సీడెడ్ ఏరియాలో 71 లక్షలు ఏపీలోని అన్ని ఏరియాలో కలిపి 2.09 కోట్లు వసూలు చేసింది.  ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 12.35 కోట్ల షేర్ తో పాటు 26.86 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట.


 అయితే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా కూడా బలగం సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లలో కలిపి బలగం సినిమా ఫుల్ రన్ లో 20 లక్షల షేర్ వసూలు చేసిందట. ఇక వీటన్నింటితో కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా బలగం సినిమాకి 12.55కోట్ల షేర్ తో పాటు 27.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇలా 1.31  కోట్ల బ్రేక్ ఇవెన్ తో బరిలోకి దిగిన బలగం సినిమా 12.55 కోట్లు వచ్చాయి. అంటే దిల్ రాజు కూతురికి ఈ సినిమా ద్వారా 11.25 కోట్ల లాభాలు దక్కాయి  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: