పవిత్ర లోకేష్ పై హాట్ కామెంట్స్ చేసిన నరేష్...!!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సెలెబ్రిటీలు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పవిత్ర లోకేష్,నరేష్ జంట అని చెప్పవచ్చు
 పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నటువంటి పవిత్ర లోకేష్ ఇద్దరు జంటగా మళ్లీ పెళ్లి  అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేసాయి. ఇకపోతే నరేష్ పవిత్ర ఇద్దరు కూడా జంటగా పలు సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే నరేష్ పవిత్ర నటించినటువంటి అన్ని మంచి శకునములే సినిమా కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుందట. నందిని రెడ్డి దర్శకత్వంలో హీరో సంతోష్ శోభన్ నటించిన ఈ సినిమా మే 18 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నరేష్ మాట్లాడుతూ పలు విషయాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు పవిత్ర లోకేష్ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలను కూడా తెలియజేశారు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ విక్టోరియాపురంలో జరిగిందని ఆయన తెలిపారు. ఇక్కడికి లోకేషన్ గురించి నరేష్ వివరిస్తూ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్లో షూటింగ్స్ పెట్టి, సరదాగా రిలాక్స్ అవ్వండని అప్పుడప్పుడు బ్రేక్లు కూడా ఇచ్చారు నిర్మాతలు. అయితే తనకు ఇక్కడ ఒక సొంత హౌస్ ఉందని నరేష్ తెలిపారు. ఇక నాకోసం ప్రతిరోజు పవిత్ర ప్రత్యేకంగా వంట చేసుకుని క్యారేజ్ తీసుకువచ్చేదని ఈ సినిమా షూటింగ్ సన్నివేశాల గురించి నరేష్ చెబుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇదంతా ఒక ఫెంటాస్టిక్ సమయమని నరేష్ తెలిపారు.  ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: