వెంకీతో దుల్కర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అట?

Purushottham Vinay
వెంకీతో దుల్కర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అట?

తన సినిమాలని రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకీ అట్లూరి. పాన్ ఇండియా లెవెల్లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో వెంకీ కూడా ఉన్నాడు.ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో ధనుష్ తో తెలుగు-తమిళ భాషల్లో సార్ సినిమా తీశాడు. ఈ సినిమాతో రెండు భాషల్లో కూడా వెంకీ హిట్ కొట్టాడు. ఇప్పుడు మలయాళం స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ హీరోగా మరో సౌత్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.దుల్కర్ సల్మాన్ కు ఓ డిఫరెంట్ స్టోరీ వినిపించాడు వెంకీ అట్లూరి. ఆ కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు దుల్కర్ సల్మాన్. సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానరే, దుల్కర్ సినిమాను కూడా నిర్మిస్తుంది.ఇక సార్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించగా.. దుల్కర్ సినిమాను కూడా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కించాలని నిర్ణయించారు. అంటే ఇది త్రిభాషా చిత్రం అని సమాచారం తెలుస్తుంది.


ఇక శ్రీకర స్టుడియోస్ ఈ సినిమాను సమర్పించనుంది.ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ నెలలో మొదలుపెడతారు. వచ్చే సంవత్సరం వేసవి నాటికి ఫస్ట్ కాపీని సిద్ధం చేసి, అదే టైమ్ లో రిలీజ్ చేయాలనేది వీరి ప్లాన్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఇక అలాగే టెక్నీషియన్స్ వివరాల్ని కూడా త్వరలోనే వెల్లడిస్తారు.ఖచ్చితంగా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందట. సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో తెలుగునాట కూడా స్టార్ హీరో అయిపోయాడు దుల్కర్. ఇప్పుడు మరో తెలుగు హీరోతో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో.ఇక చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: