హిందీ ఛత్రపతి డిజాస్టర్ తెలుగు హీరోలకి గుణపాఠం?

Purushottham Vinay
తెలుగు హీరోలకి ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా వ్యామోహం బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి రాజమౌళి బాహుబలితో దేశవ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ మార్కెట్ ని సృష్టించాడు. అలాగే రామ్ చరణ్ తారక్ కి ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశారు.ఇక అల్లు అర్జున్ అయితే పుష్ప మూవీతో రీల్స్ లో ట్రెండ్ అయ్యి కొంత హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ కారణంగా ఈ  స్టార్స్ చిత్రాలకి బాలీవుడ్ లో కూడా కొంత వరకు ఆదరణ అనేది ఉంటుంది.అయితే ప్రభాస్ ఆ పాన్ ఇండియా ఇమేజ్ ని సాహోతో నిలబెట్టుకున్నా కానీ రాధేశ్యామ్ తో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఇపుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత వరకు బజ్ క్రియేట్ చేస్తారో చెప్పలేని పరిస్థితి. అల్లు అర్జున్ అయితే హిందీలో తనకి మార్కెట్ ఎక్కువ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు బాలీవుడ్ లో వర్క్ అవుట్ అయ్యి ఉండొచ్చు. కంటెంట్ బాగుంది అనిపిస్తే కచ్చితంగా జనాలు ఆదరిస్తారు. అలా కాదని ఎలాంటి కంటెంట్ తీసినా కూడా పాన్ ఇండియా ట్యాగ్ తగిలించేసి హిందీలో కూడా రిలీజ్ చేద్దామని చూస్తే దసరా సినిమాకి వచ్చిన రిజల్ట్ వస్తుంది.


అలాగే తాజాగా ఛత్రపతి సినిమా అయితే తెలుగు హీరోలకి చాలా స్ట్రాంగ్ లెసన్ అని చెప్పవచ్చు.ఇక డబ్బింగ్ రైట్స్ కి డిమాండ్ ఎక్కువ ఉందని అలాగే యుట్యూబ్ లో మన డబ్బింగ్ సినిమాలకి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని మనకి అక్కడ మార్కెట్ బాగా ఉందని కనుక భావిస్తే ఖచ్చితంగా బోర్లా పడటం గ్యారెంటీ అని ఛత్రపతి సినిమా రిజల్ట్ ప్రూఫ్ చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమాతో పూర్తి జ్ఞానోదయం అయ్యిందని భావించొచ్చు. యుట్యూబ్ లో డబ్బింగ్ సినిమాలని ఫ్రీగా ఆడియన్స్ చూస్తారు. అలాగే కాలక్షేపం కోసం వారికి ఫ్రీటైమ్ ఉన్నప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే స్ట్రైట్ సినిమా అంటే డబ్బులు పెట్టుకొని వెళ్లి మరి థియేటర్స్ లో చూడాలి. ఆ విషయంలో నార్త్ ఆడియన్స్ కి అయితే పక్కా క్లారిటీ ఉంది. అందుకే ఛత్రపతి జీరో షేర్ తో చాలా దారుణమైన డిజాస్టర్ బొమ్మగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: