సమంత ఒక ' ఫైర్ ' అని అంటున్న కృతి శెట్టి....!!

murali krishna
చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేశారు. అయితే ఈ సాంగ్ చేసినందుకు కొందరు సమంతపై ట్రోల్స్ చేసినప్పటికీ.. మరికొందరు మాత్రం సమంత డాన్స్, ఎక్స్‏ప్రెషన్స్ ఈ పాటకు హైలెట్ అంటూ ప్రశంసలు కురిపించారు. సామాన్యులనే కాదు.. క్రికెటర్లను సైతం స్టెప్పులేయించిన ఈ పాటపై హీరోయిన్ కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
డైరెక్టర్ సుకుమార్.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ బాక్శాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టడమే కాదు.. నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటల గురించి తెలిసిందే. సామీ.. సామీ.. శ్రీవల్లీ పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. సమంత నటించి ఊ ఉంటావా.. ఊహు అంటవా మావ సాంగ్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేశారు. అయితే ఈ సాంగ్ చేసినందుకు కొందరు సమంతపై ట్రోల్స్ చేసినప్పటికీ.. మరికొందరు మాత్రం సమంత డాన్స్, ఎక్స్‏ప్రెషన్స్ ఈ పాటకు హైలెట్ అంటూ ప్రశంసలు కురిపించారు. సామాన్యులనే కాదు.. క్రికెటర్లను సైతం స్టెప్పులేయించిన ఈ పాటపై హీరోయిన్ కృతి శెట్టి ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఆమె నటించిన కస్టడీ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించగా.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. ఊ అంటావా.. లాంటి పాటలను తాను అస్సలు చేయనని తెలిపింది. ఊ అంటావా మావ వంటి పాటలలో నటించే అవకాశం వస్తే చేస్తారా ? అని అడగ్గా.. అస్సలు చేయనని సూటిగా చెప్పేసింది.
కృతి శెట్టి మాట్లాడుతూ.. “ప్రస్తుతం నాకు ఐటెం సాంగ్స్ చేసే ఆలోచన లేదు. వాటిపై నాకు అంతగా అవగాహాన లేదు.. నేను కంఫర్ట్ గా ఉండను. సౌకర్యంగా అనిపించనప్పుడు చేయకపోవడమే మంచిది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని పలు రొమాంటిక్ సీన్స్ లో కూడా మనస్పూర్తిగా నటించలేకపోయాను. మనసుకు నచ్చనప్పుడు అలాంటివి చేయకుండా ఉండడమే బెటర్. మున్ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతా. ఊ అంటావా పాటలో సమంత చాలా బాగా డాన్స్ చేశారు. ఆమె ఒక ఫైర్” అంటూ చెప్పుకొచ్చింది కృతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: