అంత పని చేసిన స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్...!!

murali krishna
ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తాను వీరాభిమానని తెలిపింది. సామ్ నటనంటే తనకు చాలా ఇష్టమని.. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటారని.. ఇక ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని తెలిపింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా ఫుల్ జోష్ మీదుంది హీరోయిన్ సంయుక్త మీనన్.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత బింబిసార, సార్ చిత్రాల్లో నటించింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించి సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ సమంతకు తాను వీరాభిమానని తెలిపింది. సామ్ నటనంటే తనకు చాలా ఇష్టమని.. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటారని.. ఇక ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని తెలిపింది.
ఇక తమిళంలో హీరో ధనుష్ నటన అంటే చాలా నచ్చుతుందని.. తాను 10వ తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ నటించిన ఆడుగళం సినిమాలోని పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్ని అని తెలిపింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని.. తనకు నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబకథా చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. అయితే తాను ఒక వ్యక్తి నడిరోడ్డుపై కొట్టిన సంఘటనను గుర్తుచేసకున్నారు సంయుక్త. ఒకసారి తన తల్లితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగను తమపై వదిలాడని.. దీంతో కోపంగ అతని చెంప పగలగొట్టానని తెలిపింది.
ప్రయాణం చేయడం.. ఒంటరిగా ఉండటం చాలా ఇష్టమని.. ఎక్కువగా హిమాలయాలకు వెళ్తుంటానని.. ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానని తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త తెలిపింది. ప్రస్తుతం సంయుక్త నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తోన్న డెవిల్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ తో జోడి కడుతుంది. ఇదే కాకుండా.. డైరెక్టర్ త్రివిక్రమ్, స్టైలీష్ స్టా్ర్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో సంయుక్తను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: