వెంకట్ ప్రభు తదుపరి మూవీ ఆ స్టార్ హీరో తోనే..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వెంకట్ ప్రభు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్నో తమిళ మూవీ లకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడి గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం శింబు హీరో గా రూపొందినటు వంటి మానాడు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ దర్శకుడు తాజాగా నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందిన కస్టడీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ దర్శకుడు తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకbకాలంలో రూపొందించాడు. ఈ సినిమాలో ప్రియమణి ముఖ్య మంత్రి పాత్రలో కనిపించగా , అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించాడు. ఇళయ రాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు.

ఈ మూవీ ని మే 5 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లు దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని ఇప్పటికే సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం వెంకట్ ప్రభి తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి తలపతి విజయ్ తో చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్న ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: