కోకో.. ఇండియాలోనే మొదటి ఆథెంటిక్.. చిత్రం..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరొక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం కో కో ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్గా రాబోతున్నది. ఈ సినిమాని డైరెక్టర్ జయకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఆటోమేషన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను కనిపెట్టిన ఒక తండ్రి మరణానికి ప్రతి కారం తీర్చుకోవడానికి ఒక హ్యాకర్ చేసిన పోరాటమే ఈ కథ అన్నట్లుగా సమాచారం.. మిరాయి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వాస ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది మేకర్స్..

ఈ సినిమా టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.. విడుదలైన కొన్ని క్షణాలలోనే టీజర్ పలు రికార్డుల వ్యూస్తో అదరగొట్టేస్తోంది .ఇక ఈ టీజర్లో ఒక్కో సిన్ ,ఒక్కో విజువల్స్ నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా కనిపిస్తున్నాయి.VFX కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అందుకే ఈ టీజర్ ను చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా సరికొత్త ఫీలింగ్ కలుగుతున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క టీజర్ తోనే ఈ సినిమా పైన భారీ అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి.

ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా జూన్ మూడో వారం నుంచి ప్రారంభం కాబోతున్నది.. లడక్ చైనా కేరళ హైదరాబాద్ తదితర లొకేషన్స్ ఈ సినిమా షూటింగ్ వంద రోజులు లోపల పూర్తి చేసుకుంది ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు టెక్నీషియన్ విషయాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించబోతోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇండియాలోని మొదటి ఆథెంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా ఇదే అంటూ నిర్మాతలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ చిత్రం ఏడాది వేసవిలో ఐదు భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: