కీర్తి శెట్టిని టార్గెట్ చేస్తున్న సమంత అభిమానులు !

Seetha Sailaja
లేటెస్ట్ గా విడుదలైన నాగచైతన్య ‘కష్టడి’ మూవీకి డివైడ్ టాక్ రావడంతో అక్కినేని హీరోలకు ఇంకా బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లే అ

అనుకోవాలి. ఈమూవీతో తన దశ తిరుగుతుందని ఆశించిన హీరోయిన్ కీర్తి శెట్టికి కూడ ఈ మూవీ రిజల్ట్ ఊహించని షాక్ 

అనుకోవాలి. 


‘ఉప్పెన’ తరువాత ఈ క్రేజీ బ్యూటీ నటించిన సినిమాలు అన్నీ వరస ఫెయిల్యూర్స్ గా మారడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈమూవీ తో తన దశ తిరుగుతుంది అని భావించిన ఈమె ఈసినిమా ప్రమోషన్ కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది. 


ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఐటమ్ సాంగ్స్ కల్చర్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు ఏసీనిమాలో అయినా ఐటమ్ చేసే అవకాశం వస్తే తాను అలాంటి అవకాశాలు ఉపయోగించుకోనని తనకు ఐటమ్ సాంగ్ చేసే ఆలోచన లేదు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు సమంత నటించిన ‘పుష్ప’ మూవీలోని ‘ఊ అంటావా’ లాంటి ఐటమ్ సాంగ్ ఆఫర్స్ తనకు రాలేదని అంటూ అలాంటి అవకాశాలు అందుకుని తాను నటించలేను అని అభిప్రాయ పడింది. 


అయితే సమంత ఆ ఐటమ్ సాంగ్ లో చాల కష్టపడి నటించింది అని చెపుతూ ఆమె పై ప్రశంసలు కురిపించింది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సమంత అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారు కీర్తిని టార్గెట్ చేస్తూ ఒక ఐటమ్ సాంగ్ లో నటించాలి అంటే ఎంతో క్రేజ్ ఉండాలని అంత స్థాయి కీర్తికి ఉందా అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే కాజల్ తమన్నా శృతి హాసన్ లాంటి క్రేజ్ ఉన్న నెంబర్ వన్ హీరోయిన్స్ భారీ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసే అవకాశం వస్తే మరో ఆలోచన లేని పరిస్థితులలో కీర్తి శెట్టి ఏవిషయంలో తాను గొప్ప అని భావిస్తోంది అంటూ విమర్శిస్తున్నారు.. ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: