సమంత స్థానాన్ని భర్తీ చేస్తున్న సీరత్ కపూర్ !

Seetha Sailaja
పుష్ప’ మూవీకి సమంత చేసిన ఐటమ్ సాంగ్ తో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ లో కూడ ఒక ఐటమ్ సాంగ్ ను మళ్ళీ సమంత తో నటింపచేయాలని సుకుమార్ ఆలోచన చేసినప్పటికీ ఆ సూచనకు సమంత సున్నితంగా నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఐటమ్ సాంగ్స్ విషయంలో సుకుమార్ చాల ప్రత్యేక దృష్టితో ఉంటాడు.

అందువల్లనే సుకుమార్ సినిమాలలోని ఐటమ్ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. ‘పుష్ప’ స్థాయి కంటే ‘పుష్ప 2’ మూవీ రేంజ్ మరింత పెంచాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న సుకుమార్ తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన ఐటమ్ సాంగ్ విషయంలో కూడ ప్రత్యేక శ్రద్దతీసుకుని ‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ ను కూడ ట్రెండింగ్ గా మార్చాలని ఆలోచనలు చేస్తున్న నేపధ్యంలో అనేక ఆలోచనలు చేసిన తరువాత ఇప్పుడు ఆ ఐటమ్ సాంగ్ కు సీరత్ కపూర్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆమె గతంలో శర్వానంద్ తో కలిసి ‘రన్ రాజా రన్’ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఆమూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఆమెకు ఆతరువాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె తిరిగి యూటర్న్ తీసుకుని బాలీవుడ్ వైపు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెను ‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ కు ఎంపిక చేయటంతో తిరిగి ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఈమూవీలో హీరోయిన్ గా నటించిన రష్మిక పాత్ర సినిమా మధ్యలో ముగిసి పోతుందని ‘పుష్ప’ విరోధులు హీరోను టార్గెట్ చేస్తూ చేసిన దాడిలో హీరో తప్పించుకుంటే శ్రీవల్లి పాత్ర చనిపోతుందని అంటున్నారు. అందువల్లనే ఈమూవీలో బన్నీ పక్కన మరొక బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక చేసారని కూడ వార్తలు గుప్పుమంటున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: